రామన్నపేట మండలం న్యూస్: (రిపోర్టింగ్ బ్యూరో చీఫ్ కే. మణిపాల్ రెడ్డి) : రామన్నపేట మండలం యాదాద్రి భువనగిరి జిల్లా లోని నాగార్జున స్కూల్ యాజమాన్యం ఇంద్రపాలనగరం గ్రామంకు చెందిన రెండేళ్ల చిన్నారి అభిజ్ఞ తారను బలి తీసుకుంది. ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే నాగార్జున స్కూల్స్ యాజమాన్యం తక్కువ జీతంతో అర్హత లేని డ్రైవర్ ను నియమించి పసిపాపల ప్రాణాలను బలి తీసుకోవడం జరుగుతుంది. ఈ ఘటనపై రామన్నపేట మేధావి వర్గాలు నాగార్జున స్కూల్ యాజమాన్యంపై విచారణ చేపట్టగా అనేక బ్రాంచీలు ఉన్నటువంటి విద్యాసంస్థలతో వీరికి సంబంధం ఉందా లేదా అన్న విషయంపై యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి సరైన స్పష్టమైన సమాచారం అందించకపోవడం , నిర్లక్ష్య వైఖరి వహించడం అర్థం కాకుండా పోతుందని స్థానికులు వాపోతున్నారు. విద్యను వ్యాపారంగా మార్చుకొని ఎటువంటి అనుమతులు లేకుండా, విద్యార్థులకు క్రీడా ప్రాంగణం లేకుండా, ఫైర్ సేఫ్టీ అనుమతి లేకుండా దందా చేస్తున్న నాగార్జున స్కూల్ యాజమాన్యం చైర్మన్ డాక్టర్ నకిరేకంటి నాగరాజు పై చర్యలు తీసుకోవాలని పలు విద్యాసంస్థలు మరియు విద్యార్థి సంఘాలు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. మరియు జిల్లా విద్యాధికారి ద్వారా స్కూల్ పై చర్యలు ఉంటాయా? ఏమిటో? తెలియాలి అంటున్నారు. ఈ యొక్క నాగార్జున స్కూల్ ను సీజ్ చేసి నేలమట్టం చేయాలని పలు రాజకీయ పార్టీ నాయకులు మరియు చిన్నారి యొక్క కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు తీయడం రెండు లక్షలు, మూడు లక్షలు బేరాలు చేయడమేనా నాగార్జున స్కూల్ యాజమాన్యం యొక్క స్థితి. ఇటువంటి అనుమతి లేని రాజకీయ నాయకుల అండదండలతో నడుస్తున్న నాగార్జున స్కూల్ ను సీజ్ చేసేంతవరకు ఊరుకోమని విద్యార్థి సంఘాల నాయకులు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నట్లు మాట్లాడారు.
రామన్నపేట మండలం, యాదాద్రి జిల్లా లో చిన్నారి ప్రాణం తీసిన నాగార్జున స్కూల్స్ యాజమాన్యం
RELATED ARTICLES

