నకిరేకల్ నియోజకవర్గం న్యూస్ : పట్టణానికి చెందిన దునుక శ్రీనివాస్ అకస్మాత్తుగా గుండె పోటుతో చనిపోవడం జరిగింది. శ్రీనివాస్ కు భార్య కొడుకులు ఇద్దరు ఉన్నారు.తెలంగాణ రక్షణ సేన పార్టీ నకిరేకల్ నియోజకవర్గం ఇంచార్జ్ మేడి నరేష్ వెంటనే నకిరేకల్ చేరుకుని శ్రీనివాస్ పార్దివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఆయొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ నుంచి ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్ తెలంగాణ మాధవక్క మరియు మండల నాయకులు సతీష్, మహేష్, సత్యనారాయణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి: టీఆర్ఎస్ నకిరేకల్ నియోజకవర్గం ఇంచార్జ్ మేడి నరేష్
RELATED ARTICLES

