జైపూర్, సెప్టెంబర్ 15 (నవ సంఘర్షణ): హైదరాబాద్‌లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో చెన్నూర్ నియోజకవర్గ ఇంచార్జ్ మేడి రాజశేఖర్ జన్మదిన వేడుకలను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మేడి రాజశేఖర్ మాట్లాడుతూ.. తన జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత గారికి తన జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తానని, చెన్నూర్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, తెలంగాణ రక్షణ సేనను నియోజకవర్గంలో మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.

