తెలంగాణ రక్షణ సేన చెన్నూర్ నియోజకవర్గ ఇంచార్జ్ మేడి రాజశేఖర్ బర్త్డే వేడుకలు
జైపూర్, సెప్టెంబర్ 15 (నవ సంఘర్షణ): హైదరాబాద్లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో చెన్నూర్ నియోజకవర్గ ఇంచార్జ్ మేడి రాజశేఖర్ జన్మదిన వేడుకలను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేడి రాజశేఖర్ మాట్లాడుతూ.. తన జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత గారికి తన జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తానని,...