
నానమ్మ- తాత జినుక శ్రీరాములు -కీ.శే. కళమ్మ
రామన్నపేట న్యూస్: సామాజిక వేత్త జినుక నాగరాజు తనయుడు జినుక విఘ్నేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జినుక నాగరాజు స్వగ్రామం లో వినాయకుని దగ్గర కుటుంబ సభ్యులతో పూజలు జరిపారు. తదుపరి కొన్ని సేవాకార్యక్రమాలు చేశారు. విద్యార్ధులకు సంబంధించిన బహుమతులు ప్రధానం చేశారు. స్థానికులు ,బంధువులు అధిక సంఖ్యలో హాజరైనందుకు వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు. విఘ్నేష్ పుట్టినరోజు సందర్భంగా అందరూ ఆశీర్వదించారు. ఈ వేడుక అద్భుతంగా నిర్వహించామని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం మరెన్నో సామాజిక సేవలు అందించాలని కోరుకుంటున్నామని అన్నారు.

