తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు, బంజారాహిల్స్ తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..
🔹అయ్యప్ప సోసైటీలో సీఎం, ఆయన కుటుంబ సభ్యులు అక్రమ దందాలు
🔹హైకోర్టు ఆర్డర్ ను లెక్కచేయకుండా అక్రమ పర్మిషన్లు ఇప్పిస్తున్నారు
🔹కాంగ్రెస్ అధికారంలో వచ్చాక అక్రమంగా 500-700 వందల అక్రమ భవనాలు నిర్మించారు
🔹ఎక్కువ దోపిడీ చేస్తే ప్రకృతి కూడా క్షమించదు.. శిక్షిస్తుంది
🔹నెల రోజుల్లో అయ్యప్ప సోసైటీలోని అక్రమ భవనాలపై చర్యలు తీసుకోవాలి
🔹లేదంటే మేమే వెళ్లి అక్రమ భవనాలకు రెడ్ మార్క్ వేస్తాం
🔹హైదరాబాద్ నగరాన్ని ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు కామధేనువుగా వాడుకుంటూ అక్రమ సంపాదన పెంచుకుంటున్నారు
🔹నగరంలో రోడ్లు, బస్తీ దవాఖాలు, మంచినీళ్లు సరిగా లేని పరిస్థితి పక్కన పెట్టి అక్రమ సంపాదనపైనే సీఎం దృష్టి పెట్టారు
🔹నగరంలో ఎటు చూసినా భూములు, పర్మిషన్లు, టీడీఆర్ పేరుతో అక్రమ దందాలే కనిపిస్తున్నాయి
🔹ముఖ్యంగా అయ్యప్ప సోసైటీలో విచ్చలవిడిగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడుతున్నారు
🔹ఆ భూముల విషయంలో ట్రస్ట్ ఛైర్మన్ విఠల్ రావు వాటిని కాపాడేందుకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు
🔹కానీ ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున అక్రమ భవనాలను నిర్మిస్తున్నారు
🔹కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయ్యప్ప సోసైటీలోని ఖానామెట్ లో 5 వందల నుంచి 7 వందల అక్రమ భవనాలు వచ్చాయి
🔹ఇప్పుడు కూడా దాదాపు 80 భవనాలు నిర్మాణంలో ఉన్నాయి
🔹కేవలం నోటరీ ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తూ…10 ఫ్లోర్ల వరకు పర్మిషన్లు ఇస్తున్నారు
🔹రెండు భవనాల మధ్య కనీసం అగర్ బత్తి పట్టేంత స్థలం కూడా లేదు
🔹అక్కడ పెద్ద కాలేజ్ లు, పీజీ హాస్టల్స్ నిర్వహిస్తున్నారు. ప్రతి భవనంలో సెల్లార్ కిచెన్ ఉంది
🔹అక్కడ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే పెద్ద ఎత్తున నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది
🔹అయిన సరే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నట్లు? ఎందుకు తనిఖీలు చేయటం లేదు?
🔹మీ మీద ఎవరి ఒత్తిడి ఉందో చెప్పండి. ఎవరు మిమ్మల్ని ఆపుతున్నారు
🔹సర్వే నంబర్ 11/ 18 నుంచి 44 వరకు వరుసగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు
🔹సర్వే నంబర్ 12 లో 12 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు? ఈ విషయాలపై ఏ రాజకీయ పార్టీ ఎందుకు మాట్లాడటం లేదు?
🔹ముఖ్యమంత్రి ఇంటికి దగ్గర్లో ఉన్న ఖానామెట్ లో అక్రమ బిల్డింగ్ నిర్మిస్తుంటే ఎందుకు ఆపటం లేదు
🔹ఓ న్యూస్ పేపర్ అక్కడ ఉన్న అక్రమ భవనాలను గూగుల్ మ్యాప్ తో సహా ట్యాగ్ చేసి న్యూస్ రాసింది
🔹దాన్ని నేను ట్యాగ్ చేసిన తర్వాత ఎంతో మంది మీడియా వాళ్లు ఆ న్యూస్ కవర్ చేసేందుకు వెళ్లారు
🔹కానీ అక్కడ ఉన్న ఓనర్లు మీడియా వాళ్లను బెదిరిస్తూ భయపెడుతున్నారు
🔹మీడియాను కూడా బెదిరిస్తూ మా వెనుక ప్రభుత్వం ఉందని ఆ ఇంటి ఓనర్లు చెబుతున్నారంట
🔹అంటే కాంగ్రెస్ నడుపుతున్నది ప్రభుత్వమా? రౌడీ రాజ్యమా?
🔹మంథని నియోజకవర్గంలో బొగ్గు బాయి రాకముందే, కనీసం సర్వే కూడా కాకముందే శాత్రాజుపల్లి అనే గ్రామంలో అర్థరాత్రి 374 ఇళ్లు కూల్చేశారు
🔹మరి హైదరాబాద్ లో ఇంత అక్రమంగా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతుంటే ఏం చేస్తున్నారు?
🔹వ్యాపార వేత్తలకు లైన్ క్లియర్ చేస్తూ పేదల పై ప్రతాపం చూపుతారా?
🔹ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ లేనందున ఒక్క ఇటుక కూడా పేర్చవద్దని హైకోర్టు ఆర్డర్ ఉంది
🔹హైకోర్టు ఆర్డర్ ను కాదని ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇస్తున్నారు
🔹ముఖ్యమంత్రి సోదరులే దగ్గరుండి పర్మిషన్లు ఇప్పిస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారు
🔹ముఖ్యమంత్రే దగ్గరుండి మరి ఈ దందా చేయిస్తున్నారు
🔹ఇంకా చాలా మంది బిల్డర్లకు సహకరిస్తున్నారు. గల్ఫ్ ఆయిల్ వాళ్లకు కూడా ఇదే విధంగా సహకరిస్తున్నారు
🔹ఇక ఆదిత్య బిల్డర్స్ వాళ్లు మూసీ గర్భంలో నిర్మాణాలు చేపడుతుంటే మేము వెళ్లి ధర్నా చేశాం
🔹మేము ధర్నా చేసిన తర్వాత మరో మూడు కొత్త ప్రాజెక్ట్ లను మూసీలోనే చేపడుతున్నారు
🔹ఇంత నిసిగ్గుగా ముఖ్యమంత్రి ఆయన సోదరులు అక్రమ సంపాదనకు తెగబడ్డారు
🔹ఆదిత్య బిల్డర్స్ ఓనర్ ముఖ్యమంత్రి సోదరులకు విల్లా ఇవ్వటంతోనే పర్మిషన్లు ఇచ్చారంట
🔹ఎక్కువ దోపిడీ చేస్తే ప్రకృతి కూడా క్షమించదు
🔹ఇక రాష్ట్రంలో ఆర్టీఐ అనేది జోక్ గా మారింది. ఎవరు అడిగిన సరే సమాచారం ఇవ్వటం లేదు
🔹ఆర్టీఐ వద్ద 18 వేల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి
🔹పెండింగ్ అప్లికేషన్లపై ఒత్తిడి పెరగటంతో ఒక్క జిల్లాలోనే 8 వందల అప్లికేషన్లను ఒక్కరోజులో సమాధానం ఇవ్వలేమంటూ చేతులేత్తేశారు
🔹అలాంటప్పుడు ఇక ఆర్టీఐ ఉండి కూడా ఏం లాభం?
🔹అయ్యప్ప సోసైటీకి సంబంధించి నేను అడిగే దానికి ఆర్టీఐ సమాధానం చెప్పాలి
🔹ఈ ప్రభుత్వానికి నెల రోజులు సమయం ఇస్తున్నాం
🔹ఈ లోపు అక్రమ భవనాల విషయంలో చర్యలు తీసుకోవాలి
🔹లేదంటే మా పార్టీ తరఫున వెళ్లి అక్రమ భవనాలకు రెడ్ మార్క్ వేసి వస్తాం
🔹అక్కడ భూములను ప్రజలెవరు కొని ఇబ్బందులు పడవద్దు
🔹అక్రమంగా నిర్మాణాలు చేస్తున్న వ్యాపారులు, నోటరీతో రిజిస్ట్రేషన్ చేస్తున్న వాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి
🔹ఖానామెట్ లో సమగ్ర సర్వే నిర్వహించాలి. అనుమతులు లేని భవనాలపై చర్యలు తీసుకోవాలి
🔹ఫైర్ సేప్టీ లేని, అక్రమ అంతస్తులు కడుతున్న వాటిపై చర్యలు తీసుకోవాలి
🔹నోటరీ ద్వారా జరుగుతున్న రిజిస్ట్రేషన్లపై రిజిస్ట్రేషన్ల శాఖ విచారణ చేపట్టాలి
🔹అయ్యప్ప సోసైటీ లో నిజమైన యాజమానుల పక్షాన మేము ఉంటాం
🔹వారికి కూడా అన్యాయం చేసే విధంగా ఇప్పుడు నిర్మాణాలు చేపడుతున్నారు
🔹ఇక రాష్ట్రానికి అమిత్ షా వచ్చి రాజకీయాలు మాట్లాడారు
🔹మన దగ్గర 320 మండలాల్లో కరువు ఉంటే ఆయనేదో సాయం చేస్తారని భావించాం
🔹కానీ కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నా చేసిందని కౌంటర్ గా హైదరాబాద్ లో ధర్నా చేశారు
🔹రాష్ట్రానికి, హైదరాబాద్ కు ఒక్క పైసా ఇవ్వలేదు గానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తారంట!
🔹దేశంలో 13 కోట్ల మంది విదేశీయులు ఉన్నారని అమిత్ షా చెబుతున్నారు
🔹అంటే గతంలో అదే విదేశీయుల ఓట్లతో గెలిచారా!
🔹ఇలాంటి అబద్దాలు చెప్పి ప్రజలను ఎందుకు మోసం చేస్తారని ప్రశ్నిస్తున్నా
🔹నా దగ్గర ఒక్క ఇంచు అసైన్డ్ భూమి, ఇనాం భూమి ఉన్న సరే ప్రభుత్వానికే ఇచ్చేస్తా
🔹గోదావరి, కృష్ణా నీళ్లను ఎత్తిపోయకుండా ఇప్పుడు నీళ్లు లేవని ముఖ్యమంత్రి చెబుతున్నాడు
🔹పంటలు వేయవద్దని సీఎం చెబుతుంటే అలా చెప్పలేదని తుమ్మల చెబుతున్నాడు
🔹అంటే వీళ్ల మధ్యే సయోధ్య లేదు. వీళ్ల కారణంగా రైతులు ఆగమయ్యే పరిస్థితి ఉంది
🔹రాష్ట్రంలో విద్యుత్ కొరత చాలా ఉంది. ఆ సమస్యను తీర్చాల్సిన అవసరం ఉంది
🔹గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మహిళ ఓటర్లు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేసుకొని టీఆర్ఎస్ కు అండగా ఉండాలి
🔹టీఆర్ఎస్ మహిళల కోసం మహిళల చేత నడిపిస్తున్న పార్టీ

