ePaper
Thursday, July 9, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్వృద్ధురాలిపై దాడి.. హత్యాయత్నం..!

వృద్ధురాలిపై దాడి.. హత్యాయత్నం..!

📰 Generate e-Paper Clip

హయత్ నగర్ పీఎస్ లో కేసు నమోదు

మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో ప్రతినిధి :

వృద్ధురాలిపై దాడి చేసి, హత్య చేసేందుకు యత్నించిన వ్యక్తిలపై హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైయింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం మునగనూరు గ్రామ పరిధిలోని జే.ఎన్.ఎన్.యూ.ఆర్.ఎం కాలనీలో దుద్దిళ్ల యాదమ్మ అనే వృద్ధురాలు తన భర్తతో కలిసి నివాసం ఉంటుంది. ప్రభుత్వం సోషల్ ఎకనామిక్ సర్వే (ఎస్ఈఎస్) నిర్వహించిన అనంతరం ఆమెకు మునగనూరులోని జే.ఎన్.ఎన్.యూ.ఆర్.ఎం కాలనీలో ఇంటిని కేటాయించింది. ఆ ఇంట్లో సుమారు 5 ఏళ్లుగా జొన్న రొట్టెలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తూ ఆమె అక్కడే నివాసం ఉంటుంది. కాగా ఈనెల 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్థానికంగా ఉండే స్వామి నాయక్ (ఆటో డ్రైవర్) తో పాటు దేవర శ్రీను, కేతావత్ కుమార్ లు కలిసి దుద్దిల్ల యాదమ్మ ఇంటిపై దాడి చేసి, ఆమెను ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చి అసభ్య పదజాలంతో దూషిస్తూ కుడిచేతి భుజాన్ని విరిచి గాయపరిచారు. అంతటితో ఆగకుండా పక్కనే ఆటోలో ఉన్న పెట్రోల్ ను డబ్బాలో నింపి..నీ పై పోసి చంపుతామంటూ హత్యాయత్నం చేశారు. దీంతో యాదమ్మ భయంతో ఇంట్లోకి వెళ్లి గడియ వేసుకొని ప్రాణాలను దక్కించుకుంది. ఈ దాడికి గల కారణాలని బాధితురాలు వివరిస్తూ.. గత కొంత కాలంగా స్వామి నాయక్ తనకు రూ. 30 వేలు ఇవ్వాలని, లేకుంటే ఇక్కడ ఉండకూడదు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నట్లు తెలిపింది. తానే కాలనీలో డ్రైనేజీ, కరెంటు వంటి వసతులు కల్పించానని అందుకుగాను స్వామి నాయక్ కొంత కాలంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు వివరించింది.

ఎవరు డబ్బులు చెల్లించకపోవడంతో మనసులో కక్ష పెంచుకున్న స్వామి నాయక్ స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసి అధికారులతో తమ ఇండ్లను రీ – ఎంక్వయిరీ చేయించినట్లు తెలిపింది. అధికారులు రీ ఎంక్వయిరీకి వచ్చిన సందర్భంగా ప్రభుత్వం తమకు మంజూరు చేసిన పత్రాలను పరిశీలించి వెళ్లిపోయినట్లు పేర్కొంది. దీనిని జీర్ణించుకోలేని స్వామి నాయక్, అదే కాలనీకి చెందిన దేవర శ్రీను, కేతావత్ కుమార్ కాలనీలో అంతా పనులకు వెళ్లడంతో మధ్యాహ్నం 12, ఒంటిగంట సమయంలో ఒంటరిగా ఉన్న తనపై దాడి చేసినట్లు యాదమ్మ భయాందోళన వ్యక్తం చేసింది. నువ్వు కాలనీలో ఉండొద్దంటూ బండ బూతులు తిడుతూ గొడవకు దిగి తన కుడి భుజాన్ని విరిచి గాయపరిచినట్లు ఆవేదన వ్యక్తం చేసింది.అంతటితో ఆకుండా స్వామి నాయక్ పక్కనే ఉన్న ఆటోలోని పెట్రోల్ ను డబ్బాలో నింపుకొని చంపుతానంటూ తనపై పెట్రోల్ పోయడానికి ప్రయత్నించాడని, తను భయపడి ఇంట్లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నానని రోదిస్తూ తన గోడును యాదమ్మ వెళ్లబోసుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, కాలనీవాసుల సహకారంతో తనకు ప్రాణహాని ఉందంటూ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!