ePaper
Thursday, July 9, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్భర్తను చంపిన భార్య 

భర్తను చంపిన భార్య 

📰 Generate e-Paper Clip

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని హత్య

రెండు రోజుల్లో కేసును చేదించిన ఎల్బీనగర్ పోలీసులు

వివరాలు వెల్లడించిన సీఐ వినోద్ కుమార్ 

మన తొలివెలుగు, క్రైమ్ బ్యూరో ప్రతినిధి :

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భార్యను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బోడ స్వరూప – బోడ నర్సింగ్ దంపతులు కూరగాయల వ్యాపారం చేసుకుంటూ ఎల్బీనగర్ లోని ఎన్టీఆర్ నగర్ లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా, కొరివి మండలం, తట్టుపల్లి గ్రామం.

కాగా ఈనెల 20వ తేదీన బోడ నర్సింగ్ (33) తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని 100 ద్వారా భార్య స్వరూప పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోస్టుమార్టం నివేదికలో ఆత్మహత్య కాదని, మెడపై తీవ్రమైన ఒత్తిడితో గొంతు నలిమి చంపినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు పోలీసులు స్వరూపను విచారించగా ఆమె తన స్వగ్రామానికి చెందిన మోహన్ అనే వ్యక్తితో ఉన్న అక్రమ సంబంధం భర్తకు తెలియడంతో కొంతకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో జరిగిన గొడవలో భర్తను శారీరకంగా లొంగదీసుకుని అతని చాతిపై కూర్చుని చున్నీతో గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకుంది. హత్య చేసిన తర్వాత నిందితురాలు ఘటన స్థలం నుంచి ప్రియుడికి చేసిన మొబైల్ ఫోను, హత్యకు ఉపయోగించిన చున్నీని పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితురాల్ని రిమాండ్ కు తరలించారు. రెండు రోజుల్లో హత్య కేసును చేదించిన ఎల్బీనగర్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!