ePaper
Thursday, July 9, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్డ్రగ్స్ వద్దు బ్రో  

డ్రగ్స్ వద్దు బ్రో  

📰 Generate e-Paper Clip

యువతను చైతన్య పరుస్తున్న పోలీసులు

మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రతి పౌరుని బాధ్యత 

డ్రగ్స్ గంజాయివంటి మత్తు పదార్థాలపై యువతకు అవగాహన కల్పించిన పహాడీషరీఫ్ పోలీసులు 

 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

 

మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రతి పౌరుని బాధ్యత అని డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలను రాష్ట్రం నుంచి తరిమి కొడదామని ఆర్జీఐఏ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో భాగంగా కొనసాగుతున్న మాదకద్రవ్యాల నిరోధక అవగాహన కార్యక్రమాలను పాటించడంలో భాగంగా, పహాడీషరీఫ్ పోలీసులు పహాడీషరీఫ్ పోలీస్ ఆధ్వర్యంలో డ్రగ్ అవేర్‌నెస్‌ను నిర్వహించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం వ్యక్తులు, కుటుంబాలు, సమాజంపై దాని దుష్ప్రభావం గురించి అవగాహన కల్పించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక, చట్టపరమైన పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించి, డ్రగ్స్ సంబంధిత కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. మాదక ద్రవ్యాల వ్యాపారం మాదకద్రవ్యాల దుర్వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని సత్వర చర్య కోసం పోలీసులతో పంచుకోవాలని పౌరులను ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, జీవితాలను నాశనం చేసే వ్యసనాల బారిన పడకూడదని పిలుపునిచ్చారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల వల్ల గంజాయి, డ్రగ్స్ మత్తు పదార్థాలు వాడినా, విక్రయించినా లేదా రవాణా చేసినా చట్టపరంగా ఎదురయ్యే కఠినమైన శిక్షలను వివరించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా డ్రగ్స్‌ను అరికట్టేందుకు పోలీసులకు సహకారం అందించాలన్నారు. యువత మాదకద్రవ్యాల బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం, రవాణా పై ఎటువంటి సమాచారం తెలిసినా డయల్ 100, 1908 ఫ్రీ నంబర్ కు సమాచారం అందించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!