దిల్సుఖ్నగర్ కనకదుర్గా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఎల్బీనగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దిల్సుఖ్నగర్లోని శ్రీ కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీ రాంచందర్, ఈఓ శ్రీమతి స్నేహలత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కి ఘన స్వాగతం పలికి, అమ్మవారి పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు తోట మహేష్ యాదవ్, మధుసాగర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

