దిల్‌సుఖ్‌నగర్ కనకదుర్గా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

దిల్‌సుఖ్‌నగర్ కనకదుర్గా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఎల్‌బీనగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీ కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీ రాంచందర్, ఈఓ శ్రీమతి స్నేహలత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కి ఘన స్వాగతం పలికి, అమ్మవారి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోట మహేష్ యాదవ్, మధుసాగర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.