ePaper
Friday, August 28, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మునుగోడు గడ్డ.. తెలంగాణ మాధవక్క అడ్డ

మునుగోడు గడ్డ.. తెలంగాణ మాధవక్క అడ్డ

📰 Generate e-Paper Clip

మునుగోడు గడ్డ… తెలంగాణ మాధవక్క అడ్డ

మునుగోడు న్యూస్: తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోని 23 నియోజకవర్గాలకు ఇంచార్జిలను ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గానికి తెలంగాణ మాధవక్క పేరును ప్రకటించడం, బాధ్యతలు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ కోసం ప్రజా సమస్యల కోసం అలుపెరుగని పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు, నాపై నమ్మకంతో,నేను చేసినటువంటి సేవలను గుర్తించి,నాకు సరైన గౌరవం కల్పించినటువంటి కల్వకుంట్ల కవితకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నానని మాట్లాడారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని,రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేందుకు తమ వంతుగా పోరాటం చేస్తానని మాట్లాడారు. అనేక రకాలుగా నాకు ప్రోత్సాహం కల్పించి, వెన్నుదన్నుగా నిలబడి, ఈ గొప్ప బాధ్యత అవకాశం కల్పించిన కల్వకుంట్ల కవితకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. మునుగోడు నియోజకవర్గంలో ఎన్ని శక్తులు అడ్డొచ్చిన తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాను ఎగురవేసి తీరుతామని తెలంగాణ మాధవక్క శపథం చేశారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install NS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!