NAVA SANGHARSHANA
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 9:10 pm Posted by : NAVA SANGHARSHANA DESK

అమ్మవారి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

గడ్డిఅన్నారం డివిజన్:  దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఎల్‌బీనగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని సాయిబాబా కాలనీ నందు భవాని యూత్ వారి అమ్మవారిని దర్శించుకుని,ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విజయదశమి పండుగ సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో మెలగాలని కోరుకుంటున్నానని ఎల్ బి నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో నాయకులు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.