ఈరోజు ఎల్బీనగర్ శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతో
ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్లో పర్యటించన నేపథ్యంలో అట్టి పనుల నిమిత్తం మరోమారు సమావేశం కావడం జరిగింది.అయ్యప్ప కాలనీ నందు డ్రైనేజ్ పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభం చేయాలని,ఆటోనగర్ డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల చెత్తాచెదారం క్లీన్ చేసి,ఫుట్ పాత్ లు నిర్మించి,సీ.సీ.కెమెరాలు మరియు లైట్లు ఏర్పాటు చేసి,రోడ్డు ఇరువైపులా చెట్లు నాటాలని కోరారు.అలాగే బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ పరిధిలోని వైదేహి నగర్ నందు నూతన రోడ్ల నిర్మాణం చేపట్టాలని,హరిహర పురం కాలని,విజయపురి కాలనీ నందు నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మరియు చంపాపేట్ డివిజన్ పరిధిలోని పవన్ పూరి కాలనీ నందు నూతన కమ్యూనిటీ హాల్ పనులను వెంటనే ప్రారంభం చేయాలని కోరారు.దానికి కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటికే ప్రతిపాదనలు పంపించడం జరిగిందని అతి త్వరలోనే పనులు ప్రారంభం చేయడం జరుగుతుంది సుధీర్ రెడ్డి కి తెలిపారు.