పల్లా సుధీర్ రెడ్డి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్యా దేవేందర్ నాయక్

దేవరకొండ సెప్టెంబర్ 18 (నవ సంఘర్షణ): దేవరకొండ మండలం పడ్మట్‌పల్లి గ్రామానికి చెందిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ పల్లా నర్సింహారెడ్డి గారి కుమారుడు కీ.శే. పల్లా సుధీర్ రెడ్డి గారి దశదిన కార్యక్రమం ఈరోజు వారి స్వగృహంలో భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గౌరవ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై నివాళులు అర్పించారు. ఆయనతో పాటు దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్యా దేవేందర్ నాయక్ గారు, పలువురు...