ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు – ఫలించిన బీఆర్ఎస్ న్యాయపోరాటం
దేవరకొండ సెప్టెంబర్ 18 (నవ సంఘర్షణ): ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడం బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన న్యాయపోరాటానికి దక్కిన విజయమని బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ గారు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగం ముందు అహంకారం బద్దలైందని, ఫిరాయింపు రాజకీయాలకు ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులపై రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా...