NAVA SANGHARSHANA
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 1:36 am Posted by : NAVA SANGHARSHANA DESK

జాజుల మమత నర్సింహా కుమారుడు రుద్రలింగం నామకరణ వేడుక

హైదరాబాద్ న్యూస్: ( రిపోర్టర్ జినుక నాగరాజు ) : హైదరాబాదులోని అల్వాల్ ప్రాంతానికి సంబంధించిన జాజుల మమత నరసింహ దంపతులకు బాబు రుద్ర లింగం జన్మించిన సందర్భంగా సమీపంలో ఉన్న ఫంక్షన్ హాల్ లో ఘనంగా వేడుక నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జాజుల మమత నరసింహ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా తమ యొక్క బంధువులు స్నేహితులు భారీ సంఖ్యలో హాజరైనందుకు వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు, ఈ యొక్క కార్యక్రమానికి ప్రధాన బాధ్యత వహించిన జాజుల నరసింహ సోదరులు వదిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ జీవితకాలం రుణం తీర్చుకోలేనని తెలిపారు. జాజుల నరసింహ ఒక సామాన్య వృత్తి మెడికల్ షాప్లో విధులు నిర్వహిస్తూ పేద వర్గాలకు ఉచితంగా అనేక రకాలుగా మందులు అందజేయడం జరుగుతుంది. జాజుల నరసింహ దృష్టికి ప్రాంతీయంగా ఉన్నటువంటి వారు ఆరోగ్య సమస్యలు తీసుకెళ్తే దగ్గరుండి నయం అయ్యేంతవరకు సహకరించే మంచి మనసున్న వ్యక్తిగా గుర్తింపు ఉన్న గుణ స్వభావి అని సొంత గ్రామస్తులు కొనియాడారు. ఎటువంటి సమస్యలున్న ఆరోగ్య సమస్యలను ప్రాంతీయ భేదాలు లేకుండా తమ దృష్టికి తీసుకురావాలని తీసుకొస్తే ఖచ్చితంగా మీ వెంట ఉండి నా వంతుగా పరిష్కారం కొరకు సహకారం అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి బల్గూరీ  సుధాకర్, పేరపెళ్లి మనోహర్ ,జినుక నాగరాజు, బి ఉపేందర్, సాయికుమార్, టిఆర్ఎస్ నకరికల్ ఎమ్మెల్యే అభ్యర్థి  మేడి నరేష్, శంకర్ పైల్వాన్, పి రాజు, కే యాదగిరి, తదితర ప్రముఖులు పాల్గొనడం జరిగింది.