NAVA SANGHARSHANA
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 11:21 pm Posted by : NAVA SANGHARSHANA DESK

హైకోర్ట్ అడ్వకేట్ రాపోల్ భాస్కర్ గణేష్ విగ్రహ దాత

దిల్సుఖ్ నగర్, కళ్యాణ్ నగర్ న్యూస్: హైదరాబాదులోని దిల్సుఖ్ నగర్ ప్రాంతంలోని కళ్యాణ్ నగర్ కు చెందిన కాలనీవాసులకు యువతకు హైకోర్టు అడ్వకేట్ రాపోల్ భాస్కర్ భారీ గణేష్ విగ్రహాన్ని దాతగా బహుకరించారు. ఆ విగ్రహాన్ని కళ్యాణ్ నగర్ కాలనీవాసులు ఆవిష్కరించాలని ప్రేమాభిమానాలతో రాపోల్ భాస్కర్ ను కోరారు. ఈ యొక్క వినాయకుని ఆగమాన్ కార్యక్రమాన్ని కాలనీవాసులతో రాపోలు భాస్కర్ కుటుంబ సభ్యులు హాజరై అంగరంగ వైభవంగా వేడుకగా నిర్వహించారు. వందల సంఖ్యలో కాలనీవాసులు, రాపోలు భాస్కర్ అభిమానులు హాజరై బాణాసంచా కాల్చారు, ఆటపాటలతో పండుగ వాతావరణం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు అడ్వకేట్ రాపోలు భాస్కర్ మాట్లాడుతూ కళ్యాణ్ నగర్ కాలనీ వాసులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, తమ ఆఫీస్ ఇల్లు తలుపులు ఎప్పుడు మీకోసం తెరిచే ఉంటాయని అన్నారు. యువత చదువుల కోసం ప్రయోజనాల కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో రాపోలు భాస్కర్ మరియు కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. మరికొందరి కాలనీవాసులను హైకోర్టు అడ్వకేట్ రాపోలు భాస్కర్ చేతులమీదుగా సన్మానం చేయించడం జరిగింది.