NAVA SANGHARSHANA
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 5:32 pm Posted by : NAVA SANGHARSHANA DESK

కల్వకుంట్ల కవితకు పాలాభిషేకం: తెలంగాణ మాధవక్క మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్ 

కల్వకుంట్ల కవితకు పాలాభిషేకం: తెలంగాణ మాధవక్క మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్

మునుగోడు న్యూస్: తెలంగాణ రక్షణ సేన పార్టీ నుంచి అధినేత్రి కల్వకుంట్ల కవిత 23 నియోజకవర్గాలకు గాను ఇంచార్జ్ బాధ్యతలకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్ గా తెలంగాణ మాధవక్కను ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బాధ్యతలు వచ్చిన సందర్భంగా పూలమాల వేయడం జరిగింది. అదేవిధంగా తదనంతరం తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత చిత్రపటానికి మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జిగా పూర్తి బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ మాధవక్క ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధులుగా తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర నాయకులు మేడి నరేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్ తెలంగాణ మాధవక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నా పట్ల విశ్వాసంతో ఇంత గొప్ప పదవి బాధ్యతలు అప్పగించిన అధినేత్రి కల్వకుంట్ల కవితకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ జీవితకాలం రుణపడి ఉంటానని హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తానని రానున్న అసెంబ్లీ ఎన్నికలలో , సాధారణ ఎన్నికలలో తమ వంతుగా పార్టీ కోసం నియోజకవర్గ ప్రజల కోసం కృషి చేస్తూ తెలంగాణ రక్షణ సేన పార్టీ యొక్క జెండాను ఎగురవేసి తీరుతానని మాట్లాడారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆహ్వానితులు ఆలేరు నియోజకవర్గం నాయకులు కందాడి మణిపాల్ రెడ్డి, మునుగోడు నాయకులు బొజ్జ లక్ష్మి, పందుల జయసుధ, సునీతమ్మ, అంజలి, నర్సింగరాజు, వెంకటేష్, ప్రశాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.