NAVA SANGHARSHANA
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 7:02 pm Posted by : NAVA SANGHARSHANA DESK

ఉపాధ్యాయులకు పీఆర్సీ,డీఏ వెంటనే అమలు చేయాలి : ఇటికల రవీందర్

ఉపాధ్యాయ ఉద్యోగులకు పీఆర్సి, డీఏ వెంటనే అమలు చేయాలి.
ఇటికాల రవీందర్
ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

భువనగిరి మండలంలోని వివిధ పాఠశాలలలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు బోయ రాములు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇటికాల రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం పీఆర్సి డీఏ వెంటనే అమలు చేయాలని అలాగే సీపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపిఎస్ విధానాన్ని అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బోయ రాములు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల కోసం పి ఆర్ సి రిపోర్టును తెప్పించుకొని వెంటనే అమలు చేయాలని అలాగే ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు హైయర్ ఎడ్యుకేషన్ చేయుటకు సంబంధించిన జి ఒ 342 అమలుకు అడ్డంకిగా ఉన్న మెమో నెంబర్ 26659 రద్దు చేయాలని కోరుతూ అలాగే పదోన్నతులలో అడ్డంకీగా ఉన్న ఆడక్వసీ అనే పదాన్ని రద్దు చేసి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు పదోన్నతుల కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అండాలు రవికుమార్ విజయ బాలకృష్ణ కనకయ్య తదితరులు పాల్గొన్నారు.